Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మిర్యాలగూడ
పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసాగా సీఎం కేసీఆర్ నిలిచారని, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు ఆసరాగా ఉన్నాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో 206 మంది లబ్ధిదారులకు రూ.2,06,23,896 విలువైన కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను శనివారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ తిరునగర్ భార్గవ్, వైస్‌చైర్మెన్ కుర్ర విష్ణు, మధార్ బాబా, పెద్ది శ్రీనివాస్‌గౌడ్, ఉదరు భాస్కర్, బంటు రమేశ్, ఐల వెంకన్న, సాధినేని శ్రీనివాస్, ఇలియాస్, కమిలీ భీంలానాయక్, గోవింద్ రెడ్డి, వజ్రం, సలీం, చీడళ్ల వెంకటేశ్వర్లు, పత్తిపాటి నవాబ్, అయోధ్య, లక్ష్మీనారాయణ, నాగార్జునాచారి, అశోక్, సుబ్బారావు, రాజు, దుర్గారావు, మధు, ఫయాజ్, ఇమ్రాన్, నాగభూషణం, అనిల్ కుమార్, శ్యామ్ ఆర్ఐ సుందర్, వీఆర్వోలు గోపీ,మల్లేశం, జానిషరీఫ్, ఎంపీపీ అమరావతిసైదులు పాల్గొన్నారు.