Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కమిషనర్ రామాంజనేయరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
పట్టణంలో కరోనా నివారణ చర్యలలో భాగంగా పట్టణంలోని 48 వార్డుల పరిధిలో కోవిడ్ నిర్దారణ పరీక్షలు వైద్య శాఖ సహకారంతో చేయడం జరుగుతుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ పి.రామాంజనేయరెడ్డి కోరారు.అదివారం జిల్లాకేంద్రంలోని 34వ వార్డులో జరుగుతున్న కోవిడ్ నిర్దారణకేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు.కోవిడ్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన భయపడాల్సిన పని లేదన్నారు.ఆరోగ్య శాఖ ఇచ్చే కిట్లు,జాగ్రత్తలు పాటిస్తే తగ్గిపోతుందన్నారు.ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ల సలహా తీసుకోవాలని సూచించారు.ప్రజలు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని, స్వీయనియంత్రణ పాటించాలన్నారు.పట్టణంలో వివిధ వ్యాపారాలు నిర్వహించే వారిని కోవిడ్ స్పైడర్గా గుర్తించి వారికి పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో వ్యాక్సిన్ వేస్తామన్నారు.వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.వ్యాక్సిన్ వేసుకోవాలనుకునే వారు మున్సిపల్ వార్డు అధికారులు వచ్చినప్పుడు తమ వివరాలు యాప్ నందు నమోదు చేసుకొని మరుసటి రోజు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో 34వ వార్డు కౌన్సిలర్ మడిపల్లి విక్రమ్, 34వ వార్డు అధికారి ఎస్ఎస్ఆర్.ప్రసాద్, సీఓ రోజా, హెల్త్ డిపార్టుమెంట్ సిబ్బంది ముజీబ్, ఆశావర్కర్ సక్కుబాయి, అంగన్వాడీ టీచర్ జుబేద్ పాల్గొన్నారు.