Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండలకార్యదర్శి మద్దెపురంరాజు
నవతెలంగాణ-గుండాల
మండల పరిధిలోని నూనెగూడెం గ్రామంలో నిలిపివేసిన ధాన్యం కొనుగోలును వెంటనే ప్రారంభించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మద్ధెపురం రాజు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఆ పార్టీ ఆధ్వర్యంలో నూనెగూడెం గ్రామంలోని దాన్యం కొనుగోలు సెంటర్ వద్ద ఎర్రజెండాలు ప్రదర్శించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని రైతులు ఆందోళన చేపడితే నాలుగు రోజులుగా ధాన్యం తుకాలు నిలిపి వేయడం కాదన్నారు. వర్షాల వల్ల ధాన్యం మొలకెత్తడంతో ్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.జిలా అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డికి ఫోన్ చేసి వెంటనే రైతులందరికీ గన్నీ బ్యాగులు ఇచ్చి ధాన్యం తూకాలు వేసి వాహనాల ద్వారా ధాన్యాన్ని మిల్లులకు తరలించి కోతలు లేకుండా దిగుమతి చేసుకోవాలని కోరారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన వడ్లకు ప్రభుత్వం వెంటనే నగదు జమ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైతులు మద్దెపురం శంకర్,మచ్చ లక్ష్మారెడ్డి,మలిపెద్ది కొండలరెడ్డి,మహేష్, లక్ష్మయ్య,అనిల్ తదితరులు పాల్గొన్నారు.