Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూర్
మన మోత్కూర్ వాట్సాప్ గ్రూప్ ఆధ్వర్యంలో కరోనా ఆపద సమయంలో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఎస్ఐ జి. ఉదరు కిరణ్ అన్నారు. మున్సిపల్ కేంద్రంలోని సుందరయ్య కాలనీకి చెందిన రావుల వెంకన్న ఇటీవల కరోనా, బ్లాక్ ఫంగస్ తో మతి చెందాడు. అతని భార్య రేణుక కూడా కరోనా పాజిటివ్‌తో పోరాడుతోంది. సోషల్ మీడియా వాట్సాప్ లో ఆర్థిక సహాయాన్ని అర్ధించగా స్పందించిన 'మన మోత్కూర్ వాట్సాప్ గ్రూప్'దాతలు అందించిన రూ.31 వేల నగదును ఆదివారం ఎస్ఐ ఉదరు కిరణ్ చేతుల మీదుగా వెంకన్న కుమారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు వాట్సాప్ గ్రూప్ గూగుల్, ఫోన్ పే ద్వారా ఒక్క రోజులో రూ.31 వేలు అందించడం మానవత్వానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మర్రి అనిల్, గ్రంథాలయ చైర్మెన్ కోమటి మత్స్యగిరి, ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు వెల్మినేటి జహంగీర్, గ్రూప్ ప్రతినిధులు దబ్బేటి సోంబాబు, గంధం శ్రీనివాస్ రావ్, బొడిగే శ్రీహరి, ఆకవరం శ్రీనివాస చారి తదితరులు పాల్గొన్నారు.