Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
భూకబ్జా ఆరోపణలతో టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి భర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ ఆత్మరక్షణ కోసం ఆత్మగౌరవాన్ని ప్రధాని మోడీకి, అమిత్‌షాలకు తాకట్టు పెడుతున్నారని సీపీఐ(ఎం) పాలకవీడు మండల కార్యదర్శి కందగంట్ల అనంతప్రకాశ్ విమర్శించారు.ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వామపక్ష భావజాలంతో వచ్చిన వాడిననే చెప్పుకునే ఈటల గులాబీ మేమే ఓనర్లమన్నావని, ఇప్పుడు బండిసంజరుకి క్లీనర్‌గా మారుతావా అని ఎద్దేవా చేశారు.బీజేపీ పల్లకి ఎక్కుతున్న నువ్వు కమ్యూనిస్టులు కేసీఆర్ కనుసన్నల్లో ఉన్నారని మాట్లాడడమంటే దెయ్యాలు వేదాలు చల్లినట్టుగా ఉందని విమర్శించారు.నీ ఆత్మ గౌరవాన్ని నిరూపించుకోవాలనుకుంటే కేసీఆర్‌కు వ్యతి రేకంగా దగాపడ్డ వాళ్లందర్ని కలుపుకుని ఆత్మగౌరవ పోరాటం పోరాటం చేయాల న్నారు.నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన నువ్వు ఏ మొహం పెట్టుకుని రైతు లకు అన్యాయం చేసిన బీజేపీలో చేరుతావని ప్రశ్నించారు.