Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనలో వినియోగదారులు
నవతెలంగాణ-మిర్యాలగూడ
లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతున్నా...కరోనా పాజిటివ్ కేసులు ఎలా పెరుగుతున్నాయి ? ప్రభుత్వం భావించినట్టు సూపర్ స్ప్రెడర్సే కరోనా వ్యాప్తికి కారణమా ? రద్దీగా ఉండే ప్రాంతాల్లో వైరస్ వైరల్ అవుతుందా..? అంటే ఈ ఘటన చూస్తే నిజమే అనిపిస్తుంది.కరోనా కేసులు, మరణాలు పెరగడానికి ఇదో ఉదాహరణగా కనిపిస్తుంది.అది నిత్యం రద్దీగా ఉండే మిర్యాలగూడ రైతు బజార్ (కూరగాయల మార్కెట్).అక్కడ ఆకుకూరలు అమ్ముతున్న మహిళను చూడండి. ఈమె శనివారం కరోనా లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లగా కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు వైద్యులు. మెడిసిన్ ఇచ్చి ఐసోలేషన్‌లో ఉండాలని మహిళను ఆదేశించారు.సీన్ కట్ చేస్తే ఆదివారం ఇలా కూరగాయల మార్కెట్లో ప్రత్యక్షమైంది.ఎంతో మందికి ఆకుకూరలు విక్రయించింది.ఈమెకు టెస్టులు నిర్వహించిన వైద్యులు మార్కెట్‌కు కూరగాయల కోసమని వెళితే..అక్కడ ఈ మహిళ దర్శనమిచ్చింది.మహిళను గుర్తుపట్టిన వైద్యులు నిలదీసే సరికి తనకు పాజిటివ్ లేదని దబాయించ బోయింది.దీంతో పోలీసుల ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చి సదరు మహిళను ఐసోలేషన్‌కు తరలించారు వైద్యులు.చూశారుగా ప్రభుత్వం కరోనా కట్టడికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా...ఇలా అవగాహనా లోపం, నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అమాయకులు కరోనా బారిన పడుతున్నారు. పాజిటివ్ వచ్చిన బాధితులు హోంఐ సోలేషన్లోనే ఉండాలని, ఇలా బయట తిరిగితే అత్యంత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వైద్యులు.రద్దీ ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు.