Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-హాలియా
కరోనా బారిన పడి మరణించిన ప్రతివారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమా వేశంలో ఆయన మాట్లాడారు.దేశంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల కరోనా రెండో దశ తీవ్రంగా విజంభిస్తుందని, దాని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫల మయ్యాయని విమర్శించారు.ప్రపంచంలో కమ్యూనిస్టు దేశాలలో క్యూబా వియత్నాం కొరియా దేశాలలో కరోనాను అరికట్టడమే కాకుండా మరణాల రేటు పెరుగుదల కాకుండా చేయడంలో విజయం సాధించాయన్నారు.వ్యాక్సిన్ తయారీలో మనం ముందు మన దేశ ప్రజలకు అందించకుండా విదేశాలకు అమ్ముకోవడమే కాకుండా వయస్సుతో ముడిపెట్టడం 45 ఏండ్లు పైబడిన వారికి ఉచితంగా ఇస్తామనడం నరేంద్రమోడీ నిర్లక్ష్యానికి నిదర్శన మన్నారు.కరోనా మరణాలు అన్నీ ప్రభుత్వ హత్యలేనని, పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించా లన్నారు.ఒకవైపు కరోనా విలయతాండవం చేస్తుంటే దేశ ప్రజలు ఉపాధికోల్పోయి వీధిన పడుతుంటే ఆదుకోవాల్సిన భారత ప్రభుత్వం డీజిల్,పెట్రోల్, గ్యాస్ రేట్లు పెంచి సబ్సిడీలను ఎత్తివేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలో అసంఘటితరంగ కార్మికులు, ఉపాధి కోల్పోయిన పేదలందరికీ ప్రతినెలా రూ. 7500 కరోనాభతి కల్పించాలన్నారు.త్వరగా దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ఇస్తేనే మూడోదశ ముప్పు తప్పు తుందన్నారు.వెంటనే వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని కోరారు.రాష్ట్రంలో కరోనాటెస్టులు పెంచి ప్రతి మండలకేంద్రాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు.వానాకాలం సీజన్ ప్రారంభమైన యాసంగిలో పండించిన ధాన్యం కొనుగోలుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.కొనుగోలు చేసిన రైతులకు నేటికీ డబ్బులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నారి అయిలయ్య, డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, అవుతాసైదులు, నాయకులు పొదిల వెంకన్న పాల్గొన్నారు.