Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మోటకొండూర్
నియోజకవర్గంలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవా , నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్న జనహదయనేత బీర్ల ఫౌండేషన్ అధినేత కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య జన్మదిన వేడుకలను ఆదివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరబోయిన మల్లేష్ యాదవ్, బీర్ల పౌండేషన్ మండల అధ్యక్షుడు భాస్కరుని రఘునాథ్ రాజ్ ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేస ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది, ఆశావర్కర్లకు నిత్యావసరాలు, మాస్కులు, చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చాడ ఎంపీటీసీ చాడ ప్రతిభ రెడ్డి, శశిధర్ రెడ్డి, కురుమ సంఘం అధ్యక్షులు రేగు చంద్రశేఖర్, వనం శ్రీధర్, శీల బాలకష్ణ, పల్లె శ్రీనివాస్, సిరబోయిన వెంకట మల్లేష్, అనంతుల నవీన్ రెడ్డి, శ్రీకాంత్, వంశీధర్ రాజ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆలేరురూరల్ : మండలంలోని పటేల్ గూడెం, గొలనుకొండ గ్రామాలలో కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య పుట్టిన రోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు ,ఈ సందర్భంగా వారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ గజమాల వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మామిడాల ఆంజనేయులు, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు సుంకరి విక్రమ్, గ్రామ శాఖ అధ్యక్షుడు జాంగీర్, గ్రామ శాఖ మాజీఅధ్యక్షులు రమేష్ , వర్కింగ్ ప్రెసిడెంట్ సంపత, నాయకులు బంగారపు మధు, కుమార్, రాజు, శ్రీనివాస్, జానీ ,తదితరులు పాల్గొన్నారు.
గుండాల : మండల కేంద్రంలో బీర్ల ఫౌండేషన్ చైర్మెన్ బీర్ల అయిలయ్య జన్మదిన వేడుకలను ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ ఈరసరపు యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైద్య సిబ్బందికి,ఆశా వర్కర్లకు సన్మాన కార్యక్రమంతో పాటు శానిటైజర్లు,మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బండారి వెంకటేశం, మాసాన్ పల్లి సర్పంచ్ ఏలూరి రాంరెడ్డి,ఎంపీటీసీలు సంగి అలివెలు వెంకటాద్రి,కెమిడి అనితా రవికుమార్,సింగిల్ విండో వైస్ చైర్మెన్్ పురుగుల యాదలక్ష్మి మల్లేష్,మాజీ సర్పంచ్లు ఊట్ల భిక్షం,జోగు శ్రీశైలం సుద్దాల,పెద్దపడిశాల,పాచిల్ల గ్రామాల ఉప సర్పంచ్లు బత్తిని రవి,బందెల ప్రమోద్,అత్తి భాస్కర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుధాగాని రాంచంద్రయ్య,పొడిశెట్టి వెంకన్న ,గూడ మధుసూదన్,ఆకుల శ్రీనివాస్,ఆంజనేయులు,కప్పరి కనకారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.