Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నార్కట్పల్లి
కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు మిగిలి ఉన్న ధాన్యాన్ని చివరిగింజవరకూ 48 గంటల్లో తూకం వేసి కేంద్రాలను మూసివేయాలని తహసీల్దార్ పి.రాధ పీఏసీఎస్, ఐకేపీ అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎస్ఐ బి.యాదయ్య, ఐకేపీ, పీఏసీఎస్, లారీ యజమానులతో జిల్లా అధికారుల ఆదేశానుసారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం, ఇంకా మిగిలి ఉన్న ధాన్యాన్ని ఆమె అంచనా వేశారు . మండల వ్యాప్తంగా సుమారు 21వేలా660 ఎకరాల్లో వరి పంట సాగుకాగా 41 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చిందని గత ఏడాది 34 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు అధికారులు వివరించారు. ఈ సీజన్లో ధాన్యం కొనుగోలు కోసం ఇందిరా క్రాంతి పథకం ఆధ్వరంలో 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో 6 కేంద్రాలను ఏర్పాటు చేసి, ఇప్పటికే ఐకేపీ 10 కేంద్రాలలో ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామని కేవలం బ్రాహ్మణ వెల్లంల, ఔరవాని గ్రామాల్లో ఇంకా 70 వేల బస్తాల ధాన్యం కొనుగోలు సిద్ధంగా ఉందని తెలిపారు. పీఏసీఎస్్ ఆధ్వర్యంలో ఏడాది ఆరు కేంద్రం లను ఏర్పాటు చేసి మూడు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు పూర్తిచేశామని అధికారులు వివరించారు. ఇంకా 70 లారీలను కొనుగోలు కేంద్రాల్లో పంపిస్తే పూర్తిస్థాయిలో చివరికి గింజను సైతం 48 గంటల్లో కొనుగోలు పూర్తి చేస్తామని వివరించారు. లారీ అసోసియేషన్ అధ్యక్షులు యుగేందర్ రెడ్డి మాట్లాడుతూ మిల్లర్లు కావాలని వారం రోజులకు పైగా ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోవడం లేదని దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు .ఎస్సై యాదయ్య మాట్లాడుతూ అధికారులు లారీ యజమానులు రైతులు మిల్లర్లు సమన్వయంతో పనిచేసి సత్వరమే 3కొనుగోలు పూర్తి చేయాలని లేనిపక్షంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో రైతులు ఒకవైపు పొలాలను దున్నకు మొదలుపెట్టారని అదే క్రమంలో ఇంకా పండించిన పంటను కళ్ళల్లో ఉంచితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. తహసీల్దార్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో హమాలీ సమస్య ,బస్తాల సమస్య రాకుండా సత్వరమే లారీ లోడింగ్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మండల మహిళా సమాఖ్య అదనపు ప్రాజెక్టు మేనేజర్ ఓగోటి కష్ణ, ఎల్లారెడ్డిగూడెం సహకార సంఘం కార్యదర్శి వెంకటయ్య, లారీ అసోసియేషన్ అధ్యక్షులు యుగేందర్ రెడ్డి, నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు .