Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
- ఎంపీ కోమటి రెడ్డి
నవతెలంగాణ-భువనగిరి
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి మెరుగైన వైద్యమందించాలని, కరోనాతో మృతిచెందిన కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. భువనగిరి పట్టణంలో గాంధీ నగర్లో చాగంటి దేవేందర్ కరోనాతో మృతిచెందడంతో పిల్లలు అనాథగా మారారు. ఆదివారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. రూ.50,000 ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా క్యాన్సర్ తో అదే వార్డులో చనిపోయిన వెలిగే అశోక్ కుటుంబాన్ని పరామర్శించి రూ.50 వేల ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాతో మృతిచెందిన కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రంలో పేద ప్రజలకు కరోనాతో చనిపోతుంటే ప్రైవేట్ వైద్యంలో అప్పులపాలు అవుతుంటే అక్కడ మోడీ ఇక్కడ కేసీఆర్ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలను చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. కనికరం లేని ప్రభుత్వం పైన ప్రజలు తిరగ బడాలన్నారు పిలుపునిచ్చారు. భువనగిరి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ చనిపోయిన ఇద్దరు కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన మానవతావాది మనసున్న హదయ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికోనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రెజహంగీర్, పోతాంశెట్టి వెంకటేశ్వర్లు, స్థానిక కౌన్సిలర్ మంజుల పచ్చర్ల హేమలత జగన్ కైరం కొండ వెంకటేష్ ,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బర్రె నరేశ,్ కార్యదర్శి కాకునురి మహేందర్ , ఎన్ఎస్యూఐ పట్టణ అధ్యక్షులు వడిచెర్ల శరత్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.