Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సేవలు అభినందనీయం
- ఎంపీ కోమటిరెడ్డి
నవ తెలంగాణ -యాదగిరిగుట్ట
ఆలేరు నియోజకవర్గంలో బీర్ల ఫౌండేషన్ చైర్మెన్ బీర్ల అయిలయ్య అన్నివర్గాలకు సేవలు అందించడం అభినందనీయమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ను ఆయన ప్రారంభించి విలేకరులతో మాట్లాడుతూ కరోనా మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు ఆలేరు నియోజకవర్గంలో వేల కుటుంబాలు బీర్ల అయిలయ్య ఆదుకున్నాడన్నారు. డబ్బులున్న వారు చాలామంది ఉన్నారని కానీ సేవ చేసేవారు కొంత మంది ఉన్నారని వారిలో బీర్ల అయిలయ్య ఓక్కడని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు ఖర్చుపెట్టి ప్రజలందరికీ ఇన్సూరెన్స్ ను కల్పించాలన్నారు. పక్క రాష్ట్రం లో కరోనా ని ఆరోగ్యశ్రీ లో చేర్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసిందని రాష్ట్రంలో మాత్రం కరోనా వచ్చిన రోగులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ లక్షలు ఖర్చు పెడుతూ అప్పులపాలు అవుతున్నారన్నారు. ఇంట్లో ఇంటి పెద్ద చనిపోతే వారిని ఆదుకునే స్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధితులకు అండగా ఉండేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య, నాయకులు అండెంసంజీవరెడ్డి,జనగామ ఉపేందర్ రెడ్డి ,గుండ్లపల్లి భరత్ ,బాలరాజు బీర్ల శంకర్ ,దుంబాలవెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆలేరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య జన్మదిన వేడుకలను ఆదివారం ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలేర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ శ్రేణులు బీర్ల నివాసం కు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు బాలరాజు పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కేక్ ఏర్పాటు చేశారు. కౌన్సిలర్లు బీర్ల అయిలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.