Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్షల రూపాయలు దండుకుంటున్న కాంట్రాక్టర్...?
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
సామాన్య ప్రజలు అవసర రీత్యా సహజ సంపదను వాడుకుంటే నేరం... కానీ అదే బడాబాబులు, కాంట్రాక్టర్లు అదే సంపదను విక్రయించి సొమ్ము చేసుకుంటూ లక్షల రూపాయాలు దండుకుంటే మాత్రం ఏ తప్పు ఉండదు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు కూడా ప్రభుత్వ సొమ్మును లూటి చేసేవాళ్లకే అండగా ఉంటారే ... తప్ప సంపదను కాపాడేందుకు ఏ ప్రయత్నం చేయరు. సరిగ్గా ఇదే పరిస్థితి మునుగోడు మండల కేంద్రంలో జరుగుతుంది. కాంట్రాక్టర్, చోటా మోటా నాయకులు కలిసి సహజ సంపదను కొల్లగొడుతున్నారు.
మునుగోడు మండల కేంద్రంలో పెద్దవాగులో మైనర్ ఇరిగేషన్ ఆధ్వర్యంలో చెక్ డ్యామ్ నిర్మాణం చేయడానికి ప్రభుత్వంసహజ సంపద విక్రయం...రూ.3కోట్లు మంజూరు చేసింది. దాని
చెక్ డ్యామ్ నిర్మాణం పేరుతో పనులు కొనసాగుతున్నాయి. నీటి నిలువ కోసం వాగులోనే చెక్ డ్యామ్ నిర్మాణం చేస్తుండడంతో అక్కడ ఉన్న ఇసుకను తోడి బునాది తీసీ సిమెంట్ పిల్లర్లు చేసి డ్యామ్ నిర్మాణం చేయాలి. అయితే ఈ క్రమంలో సుమారు 20ఫీట్లకు పైగా లోతులో వరకు ఇసుక ఉండడంతో దాన్ని పూర్తిగా దానికి సమీపంలోనే కుప్పలుగా పోశారు. కొంత లోతు తీసిన తర్వాత నల్లటి మట్టి రూపంలో కొంత ఇసుక వచ్చింది. ఇదంతా వేల ట్రాక్టర్ల వరకు వచ్చింది. ఇసుకను పూర్తిగా చెక్‌డ్యామ్ నిర్మాణం చేసే కాంట్రాక్టర్ అవసరాన్ని బట్టి రైతులకు, ప్రభుత్వ భవన నిర్మాణాలకు విక్రయిస్తున్నాడు ఒక ట్రాక్టర్ ఇసుకకు రూ.150- 300వరకు రైతుల వద్ద, ఇండ్ల నిర్మాణదారులు, ప్రభుత్వ భవన కాంట్రాక్టర్ల వద్ద నుంచి వసూలు చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 5వేలకు పైగా ట్రాక్టర్ల ఇసుకు విక్రయించినట్లు స్థానికులు పెర్కొంటున్నారు. చెక్‌డ్యామ్ నిర్మాణ సమీపంలోనే ఉన్న కాలనీవాసులు కొంత ఇంటి నిర్మాణానికి ఇసుక తీసుకెళతామంటే వారిపై నిప్పులు చెరిగి చెదరగొట్టినట్లు తెలిసింది. సహజ సంపదను దోచుకుంటున్న కాంట్రాక్టర్ విషయం అధికారులకు తెలిసినప్పటికి ఏ అధికారి కూడా కనీసం అడ్డగించే ప్రయత్నం చేయలేదు. మండల కార్యాలయాలకు సమీపంలోనే ఈ దందా జరుగుతుంటే అధికారులకు మాత్రం కనిపించడంలేదు. అయితే మండలంలో జరిగే ప్రభుత్వ భవనాలకు, డబుల్‌బెడ్ రూం ఇండ్లకు ఉచితంగా పంపిణీ చేస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉంది. ఈ ఇసుక దందాలో స్థానిక చోటా మోటా నాయకులు, అధికారులు హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఏ అధికారి కూడా ఈ ఇసుక దందాపై స్పందించడంలేదని తెలుస్తుంది. ఇప్పటికైనా స్థానిక మండల అధికారులు స్పందించి సహజ సంపదను కొల్లగొట్టకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రూ.3కోట్లు మంజూరు చేసింది. దాని పనులు కొనసాగుతున్నాయి. నీటి నిలువ కోసం వాగులోనే చెక్ డ్యామ్ నిర్మాణం చేస్తుండడంతో అక్కడ ఉన్న ఇసుకను తోడి బునాది తీసీ సిమెంట్ పిల్లర్లు చేసి డ్యామ్ నిర్మాణం చేయాలి. అయితే ఈ క్రమంలో సుమారు 20ఫీట్లకు పైగా లోతులో వరకు ఇసుక ఉండడంతో దాన్ని పూర్తిగా దానికి సమీపంలోనే కుప్పలుగా పోశారు. కొంత లోతు తీసిన తర్వాత నల్లటి మట్టి రూపంలో కొంత ఇసుక వచ్చింది. ఇదంతా వేల ట్రాక్టర్ల వరకు వచ్చింది. ఇసుకను పూర్తిగా చెక్‌డ్యామ్ నిర్మాణం చేసే కాంట్రాక్టర్ అవసరాన్ని బట్టి రైతులకు, ప్రభుత్వ భవన నిర్మాణాలకు విక్రయిస్తున్నాడు ఒక ట్రాక్టర్ ఇసుకకు రూ.150- 300వరకు రైతుల వద్ద, ఇండ్ల నిర్మాణదారులు, ప్రభుత్వ భవన కాంట్రాక్టర్ల వద్ద నుంచి వసూలు చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 5వేలకు పైగా ట్రాక్టర్ల ఇసుకు విక్రయించినట్లు స్థానికులు పెర్కొంటున్నారు. చెక్‌డ్యామ్ నిర్మాణ సమీపంలోనే ఉన్న కాలనీవాసులు కొంత ఇంటి నిర్మాణానికి ఇసుక తీసుకెళతామంటే వారిపై నిప్పులు చెరిగి చెదరగొట్టినట్లు తెలిసింది. సహజ సంపదను దోచుకుంటున్న కాంట్రాక్టర్ విషయం అధికారులకు తెలిసినప్పటికి ఏ అధికారి కూడా కనీసం అడ్డగించే ప్రయత్నం చేయలేదు. మండల కార్యాలయాలకు సమీపంలోనే ఈ దందా జరుగుతుంటే అధికారులకు మాత్రం కనిపించడంలేదు. అయితే మండలంలో జరిగే ప్రభుత్వ భవనాలకు, డబుల్‌బెడ్ రూం ఇండ్లకు ఉచితంగా పంపిణీ చేస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉంది. ఈ ఇసుక దందాలో స్థానిక చోటా మోటా నాయకులు, అధికారులు హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఏ అధికారి కూడా ఈ ఇసుక దందాపై స్పందించడంలేదని తెలుస్తుంది. ఇప్పటికైనా స్థానిక మండల అధికారులు స్పందించి సహజ సంపదను కొల్లగొట్టకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.