Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు
నవతెలంగాణ - భువనగిరి
ప్రభుత్వాలు కరోనా వల్ల ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మధ్యాహ్న భోజన కార్మికులను ఆదుకోవాలని, బకాయిగా ఉన్న సంవత్సరం వేతనాలు, నాలుగేండ్ల బిల్లులు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు అన్నారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులను ఆదుకోవాలని, బకాయిలుగా ఉన్న బిల్లులు చెల్లించాలని జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం పిల్లలు డ్రప్ ఔట్ లేకుండ తీసుకొచిన మధ్యాహ్న భోజన పథకంలో ఏళ్ల తరబడిగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసి పిల్లలకు పెడుతూ అనేక సేవలు చెస్తున్నరని తెలిపారు. కరోనా వల్ల రెండు సంవత్సరాల నుంచి ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే బకాయిగా ఉన్న సంవత్సరం వేతనం, నాలుగు నెలల బిల్లులు వెంటనే చెల్లించాలని కరోనా ఉనందున్న ఉచితంగా నిత్య అవసర సరుకులు ఇవ్వాలన్నారు. రూ. 7500 ఇవ్వాలని, ఉచితంగా బియ్యం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కన్వీనర్ మాయ కష్ణ.మధ్యాహ్న భోజనం వర్కర్స్ యూనియన్ నాయకులు ఉడుత కష్ణ, యస్.కె ముంతాజ్ బేగం, పుష్పలత పాల్గొన్నారు