Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఆర్టీయూఎఫ్ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య.
నవతెలంగాణ - భువనగిరి
కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి పెట్రోల్ డీజిల్, నిత్యావసర ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, ఈ నెల 8న ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త నిరసనలు తెలపనున్నట్టు ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబా ఆవేదన వ్యక్తపరిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆన్‌లౌన్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పెట్రోల్ డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి చేర్చాలని డిమాండ్ చేశారు. కేరళ, తమిళనాడు తరహాలో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నెలకు రూ. 7500 ఇవ్వాలని, వాహానాల ఫైనాన్సు పై మారటోరియం విధించి సంవత్సరంపాటు వాయిదా వేయాలని కోరారు. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పై సమస్యల పరిష్కారం సాధన కోసం ఈ నెల 8న ట్రాన్సోపోర్ట్ కార్మికులు కుటుంబాలతో సహా నిరసన తెలియజేయాలని కోరారు. ప్రతి కార్మికుడు ఈ కార్యక్రమంలో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేశం అధ్యక్షతన నిర్వహించిన బహిరంగసభలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు, యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎండి.పాషా జిల్లా ఉపాధ్యక్షులు పత్తి సుధాకర్ పాల్గొన్నారు.