Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
మండలంలో పలు గ్రామాలలో డీిఎంటీిఎఫ్ నిధుల నుండి నిర్మించనున్న పలు అభివద్ధి పనులకు సోమవారం స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. మండలంలోని పల్లివాడ, ఉత్తటూరు, నీర్నెముల, సూరారం గ్రామాలలో రూ.5 లక్షల చొప్పున నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, సూరారం గ్రామ ప్రాథమిక పాఠశాలలో 5 లక్షల రూపాయలతో నిర్మించనున్న అదనపు గదుల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఎక్కడ అభివద్ధి పనులను ఆపడం లేదని నిరంతరం కొనసాగిస్తున్నారని అన్నారు. అనంతరం మండలంలోని మునిపంపుల గ్రామంలో ఎంపీటీసీ గాదె పారిజాత ముకుందం మామ ఇటీవల అనారోగ్యంతో మతి చెందాడు. వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, వివిధ గ్రామాల సర్పంచులు సర్పంచ్ కడమంచి సంధ్యాస్వామి, ముత్యాల సుజాత రవి, ఎడ్ల మహేందర్ రెడ్డి, మెట్టు మహేందర్ రెడ్డి, రేఖ యాదయ్య, ఉప్పు ప్రకాష్, ఎంపీటీసీ లు పారిజాత ముకుందం, తిమ్మాపురం మహేందర్ రెడ్డి, ఎండి రేహన్, వేమవరం సుధీర్ బాబు, గొరిగే నరసింహ, ఉపసర్పంచ్లు కల్లూరి నగేష్, సల్ల అనిత సత్యప్రకాష్, మండల కో ఆప్షన్ సభ్యులు అమీర్, మండల కార్యదర్శి కంభంపాటి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.