Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- ఆలేరుటౌన్
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం స్వాగతిస్తున్నామని జిల్లా లోని ఆలేరు లో సైతం ప్రజల సౌకర్యార్థం డయాగ్నోస్టిక్ ఏర్పాటు చేయాలని ఆలేరు మాజీ శాసనసభ్యులు జిల్లా జెడ్పీ ఫ్లోర్ లీడర్ రాష్ట్ర జెడ్పీటీసీల సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ కె.నగేష్ అన్నారు. జిల్లాలో డయాగస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్కు కార్యాలయం వద్ద వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల సెంటర్ల ఏర్పాటు గురించి ప్రకటించిందని చెప్పారు. భువనగిరి జిల్లా ఆసుపత్రిలో సిటీ స్కాన్ యంత్రాలను ఏర్పాటు చేస్తే కరోనా హెచ్ ఆర్ సిటీ పరీక్షలు అందుబాటులోకి వస్తాయన్నారు. జిల్లా కోటలో రావాల్సిన డైయజ్ఞస్టిక్ సెంటర్ ను ఆలేరు సీహెచ్సీ దవాఖానలో ఏర్పాటు చేయలని తెలిపారు. జిల్లాలో నూతన పీహెచ్ సీ సబ్ సెంటర్ల భవనాలను నిర్మించి వైద్యం అందించాలని కోరారు. ఇందుకు గాను జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి కచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆఫ్షన్ సభ్యులు మహమ్మద్ గౌస్, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి దూడల్ రమేష్ పాల్గొన్నారు.