Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
సారు ఈ రోడ్డుని పట్టించుకోండి మా ఇబ్బందులను తీర్చండి అంటూ ఐదు దోనల తండా గిరిజనులు,లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు కోర్ర దేవా నాయక్ పత్రికా ముఖంగా అధికారులను వేడుకున్నారు. మండలంలోని రాచకొండ గుట్టల్లో గల ఐదు దోనలతండాకు వెళ్లే రోడ్డు ఇటీవల కురిసిన వర్షానికి గండ్లు పడి ప్రయాణించడానికి వీలు లేకుండా ప్రమాదకరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ దత్తత గ్రామమైన ఐదు దోనల తండా గ్రామానికి వెళ్లే ఎందుకు గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తండాకు వెళ్లేందుకు ఉన్న రెండు రోడ్లు ఇటీవల కురిసిన వర్షానికి గండ్లు పడి ప్రమాదకరంగా మారాయి. ప్రయాణించడానికి వీలు లేకుండా గండ్లు పడడంతో ఆ గిరిజన తండాకు,ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు.పట్టించుకోవాల్సిన ఆయా శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో పరిష్కారం దొరకక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు దోనాల తండాకు వెళ్లేందుకు ఉన్న రెండు రోడ్లు చెడి పోవడంతో ఆ తండా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని రోడ్డు మరమ్మతలు చేపట్టాలని గిరిజనులు వేడుకుంటున్నారు.