Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరు టౌన్
మున్సిపల్ కేంద్రం లోని కొలనుపాక రోడ్డు నుండి దుర్గామాత గుడి వరకు ప్రధాన జాతీయ రహదారి వరంగల్ని హైదరాబాద్ కలిపే బైపాస్ రోడ్డును ఇటీవల విస్తరించారు. రైల్వే గేట్ వద్ద అండర్ పాస్ నిర్మాణం అసంపూర్తిగా నిలిచి పోవడం, పట్టణం లోని ఆర్ఓబీ చుట్టూఅధిక దూరం ఉండడంతో ఇటు సిద్దిపేట కొలనుపాక అటు హైదరాబాద్, వరంగల్ రహదారులకు ఇరువైపులా రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులు, ప్రయివేట్ వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహన చోదకులతో ఈ రహదారి రద్దిగా మారింది. ఈ దారి పక్కనే బుజలింగం వ్యవసాయ క్షేత్రం దగ్గర లక్ష్మి నర్సింహ డిగ్రీ కళాశాల ఎదురుగా ప్రమాదకరంగా బావి ఉన్నది. దీనికి ఎలాంటి రక్షణ గోడ కానీ ఫెన్సింగ్ కానీ లేవు. వాహనాలు నడిపేవారికి ఈ ప్రాంతం లో ఎదురుగా ఏదైనా వాహనాలు, జంతువులు వచ్చినప్పుడు వాటిని తప్పించే ప్రయత్నంలో అక్కడ ఉన్న బావిని గుర్తించక అందులో పడి ప్రాణనష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి. తక్షణమే ఆ ప్రాంతంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు మరియు ఆ బావికి అనుసంధానంగా పటిష్టమైన గోడను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా వాహనదారులకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేసి బావివద్ద ప్రహారీ గోడ నిర్మించాలి
బందెల సుభాష్ స్థానికుడు
ఆలేరు మున్సిపల్ కేంద్రంలో సిద్దిపేట రోడ్ హైద్రాబాద్ వరంగల్ జాతీయ రహదారి ని కలిపే బీటీ రోడ్డు మూలమలుపుల వద్ద సంబంధిత శాఖ వారు ప్రమాద సూచిక బోర్డులు వెంటనే ఏర్పాటు చేయాలి. ఈ రోడ్డు మూలమలుపుల వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇదే రోడ్డు వద్ద వ్యవసాయ బావి సైతం ప్రమాదకరంగా ఉంది. వెంటనే ఎలాంటి ప్రమాదాలు జరగక ముందే ఈ బావి ప్రక్కన పెద్ద ప్రహరీ గోడను ఏర్పాటు చేసి ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలి .ప్రమాదాలను నివారించాలి.