Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్ధాకలిలో అలమటిస్తున్న ఉపాధికూలీలు
- అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యులు జి. నాగయ్య
నవతెలంగాణ-సూర్యాపేట
ఉపాధిహామీ చట్టంలో 54 లక్షల జాబ్‌కార్డులు కలిగిన కుటుంబాలు పని చేస్తున్నాయని,వారికి 12 వారాలుగా చేసిన పనికి వేతనాలను పెండింగ్‌లో పెట్టడం వల్ల సుమారుగా ఒక కోటీ 20 లక్షల మంది ఉపాధి కూలీలు అర్థాకలితో అలమటిస్తున్నారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యులు జి. నాగయ్య ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం నిర్వహించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆన్లైన్ సమావేశంలో ఆయన ప్రసంగించారు.కరోనా తీవ్రత వలన పనులు ఆగిన దగ్గర చట్ట ప్రకారం జాబ్‌కార్డుదారులకు నిరుద్యోగ భతి చెల్లించాలని డిమాండ్ చేశారు.ఉపాధిహామీ చట్టప్రకారం వారం వారం పేమెంట్ చేయాలని ఉన్న డైరెక్షన్‌ను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘించాయన్నారు.పైగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ గ్రూపుల జాబ్‌కార్డులను సపరేట్గా డిజిటలైజేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం వేతనాలను దేశ వ్యాప్తంగా పెండింగ్‌లో పెట్టడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.వెనుకబడిన తరగతుల అభివద్ధి కోసం కేటాయింపు జరిగిన నిధులను జనరల్ పనులకు మళ్లించాలనే ఆలోచన విరమించుకోవాలని కరోనా నుండి పేదలను గట్టెంక్కించడం కోసం నెలకు రూ.7500,కుటుంబానికి 50 కేజీల బియ్యం ఉచితంగా ఆరునెలల పాటు ఇవ్వాలని కోరారు.ఉపాధి పనిని పట్టణాలకు విస్తరింపజేసి పని దినాలు 200 రోజులకు,రోజు కూలి రూ. 600 పెంచాలని డిమాండ్ చేశారు.ఉపాధికూలీల పెండింగ్ బకాయిల విడుదల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కూలీలు పీడీకి పోస్టుకార్డులు, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా మూడు రోజులు ఈనెల 8 నుండి 10 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాల మాదిరి ఉపాధిపని ప్రదేశాల్లోనే కోవిడ్ టెస్టులు,టీకా వేయాలని డిమాండ్ చేశారు.గ్రామాల్లో ఉన్న బడులు,కమ్యూనిటీహాళ్లు, గ్రామ పంచాయతీ ఆఫీసులు,రైతు వేదికలను ఐసోలేషన్ కేంద్రాలుగా ప్రభుత్వమే నిర్వహించాలని సూచించారు.కోవిడ్‌తో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడం కోసం కేరళ ప్రభుత్వం మాదిరిగా పిల్లలకు చదువు ,పునరావాస ప్యాకేజీ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించాలని కోరారు.తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెల్లి సైదులు గత కార్యక్రమాలను సమీక్షించి భవిష్యత్ కర్తవ్యాలను ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో ఆ సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు, జిల్లా అధ్యక్షురాలు వెలది పద్మావతి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొదమగుండ్ల నగేష్, జిల్లా కమిటీ సభ్యులు పోషణబోయిన హుస్సేన్,బెల్లంకొండ వెంకటేశ్వర్లు, కంపాటి శ్రీను, బచ్చలకూరి రామ్‌చరణ్, సీమ శ్రీను, సురభి రమేశ్ పాల్గొన్నారు.