Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్లాక్‌ఫంగస్‌కు ఉచిత చికిత్స అందించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష
నవతెలంగాణ-సూర్యాపేట
దారిద్య్రరేఖ కంటే కిందికి ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు కరోనాతో పాటు బ్లాక్‌ఫంగస్‌కు ప్రభుత్వం ఉచితంగా చికిత్స చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయం ఎదుట సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ మాట్లాడారు.కోవిడ్-19 దేశంలోని ప్రతి కుటుంబాన్ని మానసికంగా,ఆర్థికంగా తీవ్ర నష్టానికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.తద్వారా అనేక కుటుంబాల్లో విషాధం మిగిల్చిందన్నారు.కరోనాతో పోరాడడానికి మోడీ ప్రభుత్వం తన బాధ్యతను పూర్తిగా విస్మరించిందన్నారు.అలాగే ప్రజలను వదిలేసి తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.కోవిడ్ -19 యొక్క నేరపూరిత నిర్వహణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దోషిగా నిలబడిందన్నారు.మోడీ ప్రభుత్వ టీకా విధానాన్ని రూపొందించి పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం సిగ్గు చేటన్నారు.'టీకాల సేకరణ' గురించి కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తోందన్నారు.అందుకే టీకాలు వేసే వేగం తగ్గిపోయిందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు దేశంలోని 140 కోట్ల జనాభాకు 39 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను మాత్రమే ఆర్డర్లు ఇచ్చాయని స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం 2021 మే 31 వరకు 21.31 కోట్ల వ్యాక్సిన్ మొదటి మోతాదులను ఇచ్చినప్పటికి కేవలం 4.45 కోట్ల మందికి మాత్రమే రెండోడోస్ టీకా ఇచ్చిందన్నారు.ఇది భారతదేశ జనాభాలో 3.17శాతం మాత్రమేనని చెప్పారు.134 రోజులలో టీకాల సగటున రోజుకు 16 లక్షల మందికి టీకా ఇచ్చారని వివరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డి, పీసీసీ అధికారప్రతినిధి చకిలం రాజేశ్వర్‌రావు, కాంగ్రెస్ లీగల్ సెల్ జిల్లా చైర్మెన్ నూకల సుదర్శన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండి.అంజద్‌అలీ, మున్సిపల్ కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్, కాస రంగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పోలగాని బాలుగౌడ్, కుందమల్ల శేఖర్, అక్కెనపల్లి జానయ్య, వెన్న మధుకర్‌రెడ్డి, ఆలేటి మాణిక్యం, తంగెళ్ల కర్నాకర్‌రెడ్డి, రావుల రాంబాబు, బానోతు మాన్సింగ్, గడ్డం వెంకన్న, బైరునాగరాజుగౌడ్, నరేందర్‌నాయుడు పాల్గొన్నారు.