Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
వికలాంగులకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.సూర్యాపేట జిల్లా మహిళా,శిశు, వికలాంగులు, వయోవద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంత్రి చేతుల మీదుగా రూ.6లక్షల పైగా చెక్కులను అందచేశారు.సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని 3 మండలాలు,1మున్సిపాలిటీ పరిధిలో వికలాంగులు సబ్సిడీ రుణాల చెక్కులను సోమవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అందజేశారు.లబ్దిదారులకు మున్సిపాలిటీ పరిధిలో ఒక యూనిట్, సూర్యాపేట మండలం,పెన్‌పహాడ్ మండలం, ఆత్మకూర్(ఎస్) ఒక్కో యూనిట్‌గా అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం పాటుపడుతూ పెద్దపీట వేశామన్నారు.జిల్లాలోని వికలాంగులంతా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్ర మంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె.నర్సింహారావు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.