Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
మండలంలోని సర్వారం, రాయినిగూడెం సహకారసంఘాల్లో జరిగిన అవినీతిపై న్యాయవిచారణ చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని సర్వారం, రాయినిగూడెం సంఘాల డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.సర్వారం సంఘంలో రబీలో కేవలం 15 వేల బస్తాల 1010 రకం ధాన్యం దిగుబడి రాగా 77 వేల బస్తాల ధాన్యం ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నించారు.చైర్మెన్ పాటు, ఇద్దరు కిందిస్థాయి సిబ్బంది కుమ్మక్కై ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి రూ.లక్షలు సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు.ఈ విషయంలో అధికారులను తప్పుదోవపట్టించి సీఈఓను సస్పెండ్ చేశారని ఆరోపించారు.ఖరీఫ్ సీజన్లో సుమారు రూ.2.50 లక్షల యూరియాను అక్రమంగా అమ్మకాలు జరిపి స్వాహా చేశారని ఆరోపించారు. రాయిని గూడెం సంఘంలో కూడా ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు సంఘం నుంచి అమ్మకాలు జరిపి అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయన్నారు.సంఘం చైర్మెన్, సీఈఓలు కుమ్మక్కై ఎల్టీలోన్లు, ఇన్సూరెన్స్ విషయంలో, ఫర్నీచర్ కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారన్నారు.ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే కమీషన్ సంఘానికి జమ చేయకుండా కమీషన్ నొక్కుతున్నారన్నారు.గతంలోని పాలకవర్గం సీఈఓను సస్పెండ్ చేస్తే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఇప్పటి వరకూ ఎలా కొనసాగుతున్నారని ప్రశ్నించారు. సంఘాల్లో జరుగుతున్న అవినీతిని జిల్లా కలెక్టర్ విచారణ జరపాలని, ధాన్యం కొనుగోళ్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలఅధ్యక్షులు త్రిపురం అంజన్‌రెడ్డి, మండల వర్కింగ్ అధ్యక్షులు మూలగుండ్ల సీతారాంరెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్లు పెండెం ముత్యాలుగౌడ్, కొత్తచంద్రారెడ్డి, మీసాలయోహాన్, మూలగుంండ్ల సుధా కర్‌రెడ్డి, జుట్టుకొండసత్యనారాయణ, బాణోతు సైదులునాయక్, చెనగాని సాంబయ్యగౌడ్, మంగళగిరి కృష్ణ, ఎంపీటీసీలు సందీప్, పాకాల పరమేశ్, మాజీ సర్పంచులు రాతికింది రామయ్య, మంగళగిరి నాగరాజు, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కె.చాంద్‌మియా, ఎస్టీ సెల్ అధ్యక్షులు శివనాయక్, యామగాని సైదులు, వట్టికూటి బాబు, భిక్షంరెడ్డి పాల్గొన్నారు.