Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
జిల్లాలో కరోనా వైరస్‌తో చనిపోయిన తల్లిదండ్రుల పిల్లలకు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ద్వారా భరోసా కల్పించాలని జిల్లా బాలల సంరక్షణ కమిటీ చైర్మెన్ రమణరావు అన్నారు.సోమవారం మహిళా శిశు వికలాంగుల, వయోవద్ధుల శాఖ ,జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారి ఆధ్వర్యంలో జిల్లాలోని కోవిడ్ బాధిత బాలలకు బాల సహాయ కిట్లను అందజేశారు.అదేవిధంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలను బాలల సంక్షేమ కమిటీ వారు పరామర్శించారు.ఆ పిల్లలకు రక్షణ, విద్య గురించి ఎలాంటి దిగులు చెందవద్దని,మేమున్నామంటూ భరోసా కల్పించారు.వారికి నెలకు సరిపడా నిత్యావసరాలు అందజేశారు.జిల్లాలోని దాసాయిగూడెం, కాసరాబాద, బాలెంల గ్రామాలకు చెందినఅనాథ పిల్లలకు ,కాసరబాదలో కోవిడ్ బాధిత బాలలకు ముగ్గురికి బాలసహాయ కిట్లు ఇందులో పిల్లల ఎదుగుదలకు అవసరమైన చిక్కీలు, బిస్కెట్లు, ఖర్జూరాలు మాస్కులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మెంబర్ త్రిభిక్షం, నాగరాజు, లింగమ్మ, బాలరక్షా భవన్ కోఆర్డినేటర్ సీహెచ్.అనంతలక్ష్మి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి రవికుమార్, సోషల్ వర్కర్ బీవీశ్రీలక్ష్మీ, ఐసీడీఎస్ సూపర్వైజర్ వెంకటమ్మ, ఉపేంద్ర, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.