Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
హుజూర్నగర్ పాత్రికేయుడు రఘును భేషరతుగా విడుదల చేయాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం మండలపరిధిలోని బాలెంల గ్రామంలో గ్రామీణ పాత్రికేయులకు బియ్యం పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.రఘును అకారణంగా అక్రమంగా అరెస్టు చేశారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా గొంతు విప్పితే వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేయడం తగదన్నారు. పత్రికలు, ప్రజాసంఘాలు, కులసంఘాలు, ప్రజాస్వామికవాదులు, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తే సాదరంగా ఆహ్వానించి,అందుకు తగిన విధంగా ప్రభుత్వాలు మసలుకోవాలని సూచిం చారు. సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది రాజ్యహింసకిందకు రాదన్నారు.రాజ్యాంగంలోనే నిరసన తెలిపే ప్రశ్నించే హక్కు ఉందన్నారు.లాక్డౌన్ సమయంలో పాత్రికేయులకు నెలకు రూ.10వేలివ్వాలని కోరారు.50 కేజీల బియ్యం ఇవ్వాలని, కరోనా బారిన పడి చనిపోయిన పాత్రికేయుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ముదిరెడ్డి రమణారెడ్డి, గట్టు శ్రీనివాస్,సర్పంచ్ రమేశ్‌నాయుడు పాల్గొన్నారు.