Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మున్సిపల్ కార్మికులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు మండల కేంద్రంలో సోమవారం ఆర్యవైశ్య మండల .పట్టణ కమిటీల ఆధ్వర్యంలో పట్టణంలోని కేజేఎన్ గార్డెన్ ఆవరణలో అన్నదానం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్‌గౌడ్,వైస్ చైర్మెన్ గ్యాద పాక నాగరాజు , మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య, కమిషనర్ జీ లావణ్యాలత, హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవా సమితి జాతీయ కన్వీనర్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వంగపల్లి అంజయ్య స్వామి,ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పసుపునురి వీరేశం ,మండల పట్టణ అధ్యక్షులు సముద్రాల కుమార్, అయిత వెంకటేష్ ,జిల్లా కార్యదర్శి బి సంతోష్ ,వాసవిసేవాదళ్ జిల్లా కన్వీనర్ ఐడియా శ్రీనివాస్ ,మున్సిపల్ మేనేజర్ సుమీత , వార్డు కౌన్సిలర్ సభ్యులు సంగు భూపతి ,టీఆర్ఎస్ నాయకులు మొరిగాడి వెంకటేష్ ,ఆడెపు బాలస్వామి, శ్రీనివాస్ , ఆర్యవైశ్య సంఘం సభ్యులు ములుగు బద్రీనాథ్, సముద్రాల సత్యం ,జీ అంజయ్య ,మ0చన మల్లేశం, టి ఉపేందర్,శివ, రామన్న పాల్గొన్నారు.