Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అనంతగిరి
ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మహిళను కానిస్టేబుల్ కాపాడిన సంఘటన మండలకేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. మండలకేంద్రంలో కుటుంబకలహాలతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడుతుందని పోలీసుల అత్యవసర 100 నెంబర్‌కు సమాచారం రావడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న బాలకష్ణ వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న మహిళను రక్షించేందుకు కోదాడ ప్రభుత్వ అంబులెన్స్‌కు కాల్ చేశారు.ఎంత మేరకు వాహనం రాకపోవడంతో కానిస్టేబుల్ బాలకష్ణ ఘటనా స్థలంలోనే ఉండి తన చరవాణి ద్వారా హుజూర్నగర్ ప్రభుత్వాస్పత్రి నుండి అంబులెన్స్‌ను పిలిపించి దగ్గరుండి మహిళలను వాహనం ద్వారా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.అనంతరం ఆమె ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు కానిస్టేబుల్ బాలకష్ణ తెలిపారు. 100 డయల్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు .కొందరు ఆకతాయిలు కాలక్షేపం కోసం 100 ఫోన్ చేసి తప్పు సమాచారం ఇస్తున్నారని ఇలా చేయడం వల్ల అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి సహాయం చేయలేక పోతున్నామన్నారు.ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ బాలకష్ణను ఎస్ఐతో సహా పలువురు ప్రశంసించారు.