Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి
నవతెలంగాణ -తిప్పర్తి
రాష్ట్రాభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మామిడాల గ్రామంలో సోమవారం మామిడాల గ్రామ పాలేరు వాగు బ్రిడ్జ్ నిర్మాణానికి భూమిని పరిశీలించి మాట్లాడుతూ తిప్పర్తి మండలాన్ని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నానమన్నారు. గతంలోనే మామిడాల గ్రామానికి 35 లక్షల సీసీ రోడ్ల నిర్మాణానికి ఇచ్చామని అంతేకాకుండా ఇప్పుడు పాలేరు వాగు బ్రిడ్జిని నిర్మించడానికి నాలుగున్నర కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నామని ఇంకా ముందు మామిడాల గ్రామానికి చేస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మామిడాల ఎంపీటీసీ సిరివెన్నెల ఈదయ్య గ్రామ శాఖ అధ్యక్షులు బొల్లేధు వెంకన్న ఉప సర్పంచ్ జేరిపోతుల తిరుపతి గోదావరి గూడెం ఎంపీటీసీ సందీప్ రెడ్డి అంతటి చెన్నకేశవులు కుమ్మరి నాగయ్య ముకురాల చెన్నకేశవులు అనుములపూరి అనిల్ బోలెద్ధ భాస్కర్ అధికారులు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు