Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం
- పెట్రోల్,డీజిల్ ధరల పెంపు ప్రజల నడ్డి విరిచే చర్య
- సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
- చిన్నకొండూరులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
నవతెలంగాణ-చౌటుప్పల్రూరల్
దేశ వ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ ధరలను నిత్యం పెంచుతూ ప్రజల నడ్డి విరిచేలా కేంద్రంలోని మోడీ సర్కార్ పని చేయడం సిగ్గు చేటని యాదాద్రి భువనగిరి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. పెరుగుతున్న ధరలను అదుపు చేయడంలో మోడీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలోని చౌరస్తా లో మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలతో ప్రజల జీవనం భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు పెట్రోల్ ,డీజిల్ ధరలను పెంచకుండా మౌనంగా ఉన్న మోడీ,ఎన్నికల అనంతరం ఈ నెల రోజుల్లోనే 19 సార్లు పెట్రోల్ ,డీజిల్ ధరలను పెంచుతూ వంద రూపాయలకు చేసిన మహా ఘనుడని విమర్శించారు. ఇప్పటికే నూతనంగా తెచ్చిన రైతు చట్టాలు రైతులకు ఉరి తాడుల ఉంటే ,పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు రైతుల పట్ల, పట్ల మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా ఉన్నదని అన్నారు. అంతర్జాతీయ యంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న కూడా భారత్ లో మాత్రం ధరలు పెంచడం సబబు కాదని అన్నారు. ఒకే పన్ను, ఒకే దేశం అంటూ తీసుకువచ్చిన జిఎస్టీ పరిధిలోకి క్రూడాయిల్ ను ఎందుకు తీసుకురావడం లేదో.దేశ ప్రజలకు మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనేక రకాలుగా పన్నులు విధించి,ఇష్టానుసారంగా ధరలను పెంచుతూ పోతూ కార్పోరేట్ శక్తులకు లాభం కూర్చే విధంగా పాలన చేయడం దారుణమని అన్నారు.పెట్రోల్,డీజిల్ ధరలు పెరగడంతో అన్ని రకాల వస్తువుల ధరలపై ప్రభావం పడుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎలా బతుకుతారో చెప్పాలని అన్నారు. మోడీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని,వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఇప్పటికైనా ధరల పెరుగుదలపై సమీక్ష చేసి,ధరలను కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బూర్గు కష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఆనగంటి వెంకటేష్,మండల కమిటీ సభ్యులు చింతల సుదర్శన్, నాయకులు నందీశ్వర్,రమేష్, జంగయ్య, లింగస్వామి, మధు,శ్రీరాములు ,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.