Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్
నవతెలంగాణ-తుర్కపల్లి
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలనిసైసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య అన్నారు. మంగళవారం మండలంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వారు పరిశీలించారు. తుర్కపల్లి , ముల్కలపల్లి పీఏసీఎస్ కేంద్రాల వద్ద ధర్నా చేస్తున్న రైతులకు మద్దతు తెలిపి వారికి మనోధైర్యం కల్పించారు. గంధమల్ల వద్ద ఉన్న పీఏసీఎస్ కేంద్రాన్ని కూడా సందర్శించి అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్య తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ , సంబంధిత అధికారులతో ఫోనులో మాట్లాడారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యాన్ని సకాలంలో కొనడంలేదన్నారు. టీఆర్ఎస్కు సబంధించిన వారి ధాన్యాన్ని మాత్రమే కాంటా వస్తేన్నారని మిగతా రైతులవి కాంటా వేయడంలేదని ఆరోపించారు. మ్యాచర్ చూసి అధికారులు ఏగ్రేడ్ కింద సర్టిఫై చేసి మిల్లర్లకు పంపితే వాళ్ళు దాన్ని బీ గ్రేడ్‌గా తీసుకుంటున్నాని తెలిపారు. ధాన్యాన్ని రెండు మూడు రోజుల్లో కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎలుగల రాజయ్య,డీసీసీ ప్రధాన కార్యదర్శి గుడిపాటి మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షులు ధనావత్ భాస్కర్ నాయక్, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చాడ భాస్కర్ రెడ్డి, గుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, ఆలేరు ఎంపీపీ గంధమల్ల అశోక్, ఎంపీసీలు వనజ హన్మంత్ రెడ్డి, మోహన్ బాబు నాయక్, ప్రతిభ రాజేష్ నాయక్ ,గుట్ట మండల అధ్యక్షులు కానుగు బాలరాజు గౌడ్, రాజపేట్ అధ్యక్షులు మహేందర్ గౌడ్, ఆలేరు అధ్యక్షులు వెంకటేశ్వరరాజు, తదితరులు పాల్గొన్నారు.