Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న అన్ని స్థాయిల్లోని అన్ని రకాల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైద్య,ఆరోగ్య శాఖలోని సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 24 సంఘాల ప్రతినిధులు మంగళవారం కలెక్టర్ అనితారామచంద్రన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక నాయకులు డాక్టర్ వంశీకష్ణ, డాక్టర్ ప్రవీణ్ ,ఫిమేల్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవిక మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అన్ని స్థాయిల్లోని సిబ్బంది కుటుంబాలకు వెంటనే వ్యాక్సినేషన్ వేయాలని, కరోనాకు గురైన ఉద్యోగులందరికీ ప్రభుత్వ,ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆక్సిజన్‌తో కూడిన పది శాతం బెడ్స్ ప్రత్యేకంగా కేటాయించాలని కోరారు. అనంతరం జిల్లా వైద్య అధికారి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య,ఆరోగ్య శాఖ సంఘాల ఐక్యవేదిక నాయకులు డాక్టర్ కిరణ్, కల్లూరి మల్లేశం, కార్యదర్శులు భువనగిరి సత్యనారాయణ,లూర్దు శౌరి, ఫార్మసిస్ట్ యూనియన్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి ఫిమేల్ అసోసియేషన్ నాయకురాళ్ళు కిరణ్మయి, భవాని, సుజాత, విజయ, వసంత, శ్రావణి, ఎంహెచ్పీపీఎస్ నాయకులు నరసింహ, జానకిరాములు, సురేష్ ,ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు లలితా ,సంతోష్, కల్పన పాల్గొన్నారు