Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
పట్టణంలో కరోనా బాధితులకు ఎస్వీ చారిటబుల్ ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయి.13 రోజులుగా పట్టణంలోని 50 మంది పైచిలుకు కరోనా బాధితులకు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్ని రకాలైన పౌష్టికాహారం పంపిణీ చేయడం జరుగుతుందని ట్రస్ట్ చైర్మెన్ కోతి సాయి శరణ్య రెడ్డి,ట్రస్ట్ నిర్వాహకులు మూడవ వార్డు కౌన్సిలర్ కోతి సంపత్‌రెడ్డి తెలిపారు.మంగళవారం వారు మాట్లాడుతూ కరోనా బాధితులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవలు అందించాలనే ఉద్దేశంతో వారికి కష్టకాలంలో అండగా నిలబడి మనోధైర్యం కల్పించాలని తమసంస్థ నిర్ణయించిందన్నారు.దానిలో భాగంగానే 12 రోజులుగా మధ్యాహ్న భోజనాన్ని, అన్ని రకాలైన జాగ్రత్తలు పాటిస్తూ ఇంటివద్దే భోజనం తయారు చేసి కరోనా ఐసోలేషన్ సెంటర్లకు,బాధితుల ఇండ్లకు వెళ్లి పంపిణీ చేస్తున్నామన్నారు.చికెన్, కోడిగుడ్డు, అన్ని రకాల కూరగాయలు,సాంబారు, పెరుగు తదితర పోషకాహారం తో కూడిన భోజనం అందిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు యూత్ సభ్యులు ముస్తఫా, కొబ్బెర సాయిరాం, వినోద్, పిల్లి శివ, అహ్మద్, కాలువ వినోద్, ఆవుల నరేష్, గణేష్, సిద్ధిశ్రీకాంత్,వేముల అరుణ్, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.