Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మీ,షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలుచేస్తోందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.మండలంలో 93 మంది లబ్దిదారులకు ఇంటింటికెళ్లి చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయన్నారు.రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుజాత శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీటీసీ పోరెడ్డి శైలజా రవీందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మెన్ కడియం వెంకట్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ గుత్తికొండ ప్రమీల వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీలు కడియం స్వప్న వెంకటరెడ్డి, మేళ్లచెరువు వెంకటరమణ, రామ్మల్లమ్మ, మేకల స్రవంతి శోభన్‌బాబు, ఆకుల అరుణ భిక్షం, సర్పంచులు త్రిపుర సీతారాంరెడ్డి, నలబోలు సక్కుబాయమ్మనారాయణరెడ్డి, నల్లపాటి వీరమ్మ భాస్కర్, సుందరినాగేశ్వరరావు, మూలగుండ్ల విజయ సీతారాంరెడ్డి, ఎంపీఓ లావణ్య, ఆర్ఐ తబ్రేజ్, కల్మల్చెర్వు గ్రామ శాఖ అధ్యక్షుడు ఎల్గూరి సత్యనారాయణరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు వట్టే ఎల్లయ్య యాదవ్, ఎస్సీసెల్ అధ్యక్షుడు బచ్చలకూరి శ్రీను పాల్గొన్నారు.