Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
సుపారీ గ్యాంగ్‌ను పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు.సీఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..సోమవారం సాయంత్రం నమ్మదగిన సమాచారం ప్రకారం...ఫిబ్రవరి నెలలో కుడకుడకు చెందిన ఉప్పల శ్రీను కిరాయి హంతకులతో అదే గ్రామానికి చెందిన శశిధర్‌రెడ్డిని భూమి విషయంలో హత్య చేయించారు.తనను కూడా చంపిస్తాడనే భయంతో ఉప్పల శ్రీనివాస్‌ను చంపేందుకు బూరశేఖర్గౌడ్ పథకం పన్నాడు.ఈ క్రమంలో పొలాస మహేందర్, బందారి వీరన్న, పల్స రమేశ్, చందుపట్ల సంతోష్‌రెడ్డి, బొజ్జ మల్లేష్, పంతంగి మల్లేష్, జన్నుకోటి, జినుకుల కమలాకర్, దామెర రాకేష్, షస్త్రక్ ఇస్మాయిల్‌ను కాంట్రాక్టు తీసుకున్నాడు. 25-05-2021, 01-06-2021న రెండుసార్లు కుడకుడలో గల ఉప్పల శ్రీనివాస్‌ను భూమి వద్ద హత్య చేయుటకు ప్రయత్నించగా తటిలో తప్పించుకున్నాడు.నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం సాయంత్రం పోలీసులు కుడకుడ శివారులోని శంకర్‌రెడ్డి గెస్ట్‌హౌస్‌పై దాడులు నిర్వహించారు. సఫారీగ్యాంగ్ను అరెస్టు చేశారు.విచారణ అనంతరం నిందితులను కోర్టుకు రిమాండ్ చేశారు.చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న ఎస్సై విష్ణుమూర్తిని, సిబ్బందిని సీఐ అభినందించారు.