Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
కరోనా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ మానవతాదృక్పథంతో ముందుకు రావాలని జిల్లా బట్టల సంఘంఅధ్యక్షులు గండూరి శంకర్, టీఆర్ఎస్ రాష్ట్ర గండూరి ప్రకాశ్ అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని కుడకుడరోడ్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో గండూరి జానకమ్మ జ్ఞాపకార్థం కరోనా రోగుల బంధువులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.గండూరి పావనికృపాకర్ అన్నదానం చేర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ పున్నం కృష్ణమూర్తి, పున్నం గిరిజ, గండూరి సుధీర్, గండూరిపద్మ, టీఆర్ఎస్ నాయకులు వల్దాసు జానీ, బావ్ సింగ్, యాదకిరణ్, నామా వేణు, యలగందుల వెంకటేశ్వర్లు,తేలుకుంట్ల వెంకటేశ్వర్లు,యలగందుల లక్ష్మయ్య, ధూలం నగేశ్, పాపని యాదగిరి,అజరు, సత్యనారాయణ పాల్గొన్నారు.