Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ, కరోనా కట్టడి కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని మండల వైద్యాధికారి నాగునాయక్ అన్నారు.మంగళవారం మండలకేంద్రంతో పాటు, తూర్పుగూడెం, ఏనెకుంట గ్రామాలలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు నిర్వహించి మాట్లాడారు.ఈ మేరకు తుంగతుర్తిలో 131 మందికి పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మందికి, తూర్పుగూడెం, ఏనేకుంట గ్రామాలలో వరుసగా 146, 172 మందికి పరీక్షలు నిర్వహించగా ఒక్కొక్కరికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందన్నారు.వారికి మెడిసిన్ కిట్లు అందజేసి, పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏనెకుంటతండా సర్పంచ్ భానోత్ విజయ బాలు, పంచాయతీ కార్యదర్శులు అఖిల్, చైతన్య హెల్త్ అసిస్టెంట్లు గాజుల సోమయ్య, నర్సింహాచారి, ఏఎన్ఎంలు కమల, జయమ్మ, ఆశావర్కర్స్ కోటి పాల్గొన్నారు.