Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ -ఆలేరుటౌన్
ఎస్సీ, ఎస్టీ ఉపాధి కూలీలకు కూలి డబ్బులు చెల్లించాలని సీపీఐ జిల్లా కార్య వర్గ సభ్యులు సిహెచ్.వెంకటేశ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యావసర సరుకులు కొనేందుకు ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఎస్సీ ,ఎస్టీ లతో పాటు ఇతర బీసీ వర్గాలకు సైతం కూలీ డబ్బులు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. తెడ్డు ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ నాయకులు మాటూరి జానమ్మ ,జి.శ్రీనివాస్ , కందుల మధు,తెడ్డు అరుణ, శ్రావణ్ ,పోచమ్మ ,మల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.