Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మోత్కూరు
కరోనా కష్టకాలంలో పేద కుటుంబాలకు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎస్ఐ జి.ఉదరు కిరణ్ అన్నారు. హైదరాబాదుకు చెందిన రాజమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కేంద్రంలో కరోనా బాధితులు, చిరు వ్యాపారులు 20 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, టీఆర్ఎస్ నాయకుడు మర్రి అనిల్ కుమార్, రాజమాత ఫౌండేషన్అధ్యక్షుడు ఉదరు కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మనోజ్ కుమార్రెడ్డి, శివకుమార్, రణధీర్ రెడ్డి, వేణుగోపాల్, శ్రీకాంత్, ఏఎన్ఎం రాములమ్మ, ఆశావర్కర్ జ్యోతి పాల్గొన్నారు.
మున్సిపల్ కేంద్రంలోని సుందరయ్య కాలనీకి చెందిన రావుల వెంకన్న ఇటీవల కరోనాతో మతి చెందగా ఆ కుటుంబానికి మంగళవారం పల్లపు సమ్మయ్య, ఊర సారయ్య రూ.6 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఏఎన్ఎం రాములమ్మ రూ.500 అందజేశారు.