Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
కరోనా కాలంలో చికెన్, మటన్ ధరలు అమాంతంపెరిగిపోయాయి.సామాన్య ప్రజలు తినే చికెన్ ధరలు పెరిగిపోవడంతో కరోనా కాలంలో కనీసం పౌష్టికారంగా తినే చికెన్ కొనలేని పరిస్థితి నెలకొంది. ఆలేరు మున్సిపల్ కేంద్రంలో పెరిగిన చికెన్ ,మటన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ ధర రూ.210 - 350 వరకు పెరిగింది. చికెన్ లైవ్ రేటు కిలో రూ.130 ండగా డ్రెస్సింగ్తో రూ.210 , స్కిన్లెస్ 250, బోన్లెస్350 రూపాయలకు అమ్ముతున్నారు. మటన్ కిలో రూ. 750- 800 వరకు అమ్మతున్నారు. మటన్ ఖీమా రూ.1000 విక్రయిస్తున్నారు. బొటీ రూ.250 మేక, గొర్రె పొటేల్ తలకాయ కాల్చి విక్రయించినట్టయితే రూ.600-800 వరకు విక్రయిస్తున్నారు. పోయిన 2020 సంవత్సరం కరోనా వైరస్ వచ్చిన మొదట్లో చికెన్ తింటే కరోనా వస్తుందనే వదంతులు వ్యాపించడంతో కిలో కేవలం 40 రూపాయలకే దుకాణదారులు అమ్మారు. దీంతో పౌల్ట్రీ వ్యాపారులు బాగా నష్టపోయారు. ఫౌల్ట్రి ఫారం యజమానులు ఉచితంగా కూడా పంపిణీ చేశారు.కొందరయితే కొళ్లను అన్నింటినీ సజీవంగానే పూడ్చేశారు.కానీ ఈ ఈ సంవత్సరం పరిస్థితి మరోలా ఉంది. పోయిన మే నెల రంజాన్ మాసం నుండి ధరలు పెరిగాయి. ధరలు పెరిగినప్పటికీ గిరాకీలు బాగానే ఉన్నట్టు దుకాణాల యజమానులు చెబుతున్నారు. కరోనా కు పౌష్టికాహారం తీసుకోవడానికి ప్రజలు ఎక్కువగా చికెన్, మటన్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో మంసం విక్రయదారులు అమాంతం రేట్లు పెంచారు. దీంతో సామాన్య ప్రజలు మాత్రం ఏం కొనేటటు,్ట తినేటట్టు లేదని, అన్ని నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయని చికెన్, మటన్ సైతం ధరలు సైతం చుక్కలనంటాయని వాపోతున్నారు. పెరిగిన ధరలను నియంత్రించాలని కోరుతున్నారు.