Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
విత్తనాలు,ఎరువులు,పురుగు మందులపై రాష్ట్ర ప్రభుత్వం సబ్సీడీని యథావిధిగా కొనసాగించాలని ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కర్రె పాండరి, జిల్లా సహాయ కార్యదర్శిసుంచు యాకూబ్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను గ్రామ పంచాయతీ, సహకార సంఘాల ద్వారా ఎక్కడికక్కడే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. బడా కార్పొరేట్ కంపెనీలకు,సంస్థలకు,దోపిడీ వర్గాలకు లక్షల,కోట్ల రూపాయలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు,రుణాలు ఇవ్వగాలేనిది, రైతులకిచ్చే సబ్సిడీలను ఎత్తివేయడం చాలా అన్యాయమని పేర్కొన్నారు.