Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్‌చైర్‌పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ
నవతెలంగాణ-సూర్యాపేట
కోవిడ్వ్యాక్సిన్తో కరోనా వైరస్ కట్టడి అవుతుందని, అందుకోసం ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మున్సిపల్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కేంద్రాన్ని బుధవారం ఆమె పరిశీలించి మాట్లా డారు.మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదేశానుసారం పట్టణంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రతి రోజు సమీక్షిస్తు న్నామన్నారు.అధికారులతో కలిసి పట్టణంలో ఎక్కడనైనా ఎలాంటి అలసత్వం వహించకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం చేసే విధంగా ప్రయత్నం కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి.రామాంజనేయరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వైఎల్ఎన్.గౌడ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.