Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఐసోలేషన్లోనున్ననిరుపేద కరోనా బాధితులకు మూడో విడత బీఎల్ఆర్ చివరి కరోనా కిట్లను బుధవారం సామాజికవేత్త, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు నూకల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయన్నారు.నియోజకవర్గంలో బీఎల్ఆర్ చేస్తున్న కరోనా కిట్ల పంపిణీ కార్యక్రమం అద్వితీయమైందన్నారు.బీఎల్ఆర్లాగా ఊరికొకరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే కరోనా బాధితులకు చాలా ఉపశమనంగా ఉంటుందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను బీఎల్ఆర్ మరెన్నో చేయాలని, పేద ప్రజలను ఆదుకుంటూ ఉండాలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు చిలుకూరి బాలు, దేశిడిశేఖర్రెడ్డి, గంధంరామకష్ణ, రవినాయక్, మంత్రాల రుణాల్‌రెడ్డి, చల్లా వెంకన్న, గుంజాశ్రీనివాస్, గోవర్థన్చారి, ఆరీఫ్, వెంకటకష్ణ పాల్గొన్నారు.