Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
కరోనా విపత్కర సమయంలో ప్రతిఒక్కరూ సమాజసేవకు పాటుపడాలని వస్త్రవ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్షులు గండూరి శంకర్,పట్టణ అధ్యక్షులు గండూరి కపాకర్ అన్నారు.బుధవారం జిల్లాకేంద్రంలోని గాంధీ విగ్రహం సమీపంలో వివిధ ఆస్పత్రికి వచ్చిన రోగుల బంధువులకు వస్త్ర వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కపాకర్ మామ గండూరి సత్యనారాయణ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అన్నదానాన్ని ప్రారంభించి మాట్లాడారు.లాక్డౌన్ నేపథ్యంలో హోటళ్లు మూసివేయడంతో రోగులు పడుతున్న ఇబ్బందులను దష్టిలో పెట్టుకొని వస్త్ర వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో 23 రోజులుగా భోజన వసతి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో గండూరి సుధీర్, వెంకటేశ్వర్లు, యాదగిరి, నగేష్, లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు ,అజరు, సత్యనారాయణ పాల్గొన్నారు.