Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లి బిడ్డల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ -నల్గొండ
ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలను సీఎం కేసీఆర్ పూర్తిగా మార్చి అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యసేవలందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ హబ్‌ను, అక్సిజన్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రోగ నిర్దారణ పరీక్షలు చేయడం కోసం ప్రత్యేకంగా అధునాతన పరికరాలతో డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ సెంటర్ లో క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గుండె పరీక్షలు కూడా చేసేలా అధునాతన పరికరాలను అందుబాటులో కి తెచ్చామన్నారు. ప్రభుత్వాస్పత్రులలో మెరుగైన వైద్య సేవలను అందించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రజలకు అందించేలా సబ్ కమిటీ అధ్యయనం చేస్తుందని తెలిపారు. రూ.10 వేల కోట్లు వెచ్చించి ప్రభుత్వాస్పత్రులను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు . ఈ డయగ్నోస్టిక్ సెంటర్లల్లో సేవలకు ఆటంకం కాకుండా ప్రత్యేక సిబ్బందిని మెకానిక్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసామన్నారు. ఐసీయూ బెడ్స్ కలిగిన మొబైల్ వైద్యం అందించేందుకు బస్సులను కూడా అందుబాటులో తెచ్చామని పేర్కొన్నారు. అదేవిధంగా మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి , నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ , మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, వైస్‌చైర్మెన్ అబ్బగోని రమేష్ ,ఆస్పత్రి సూపరింటెండెంట్ జై సింగ్ రాథోడ్ ,డీసి హెచ్ సు మాత నాయక్ ,డీఎంహెచ్ఓ కొండలరావు, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ పుల్లారావు ,డయాగస్టిక్ సెంటర్ నోడల్ ఆఫీసర్ అరుంధతి ,టీఆర్ఎస్ నాయకులు కటికం సత్తయ్యగౌడ్ కరీంపాష తదితరులు పాల్గొన్నారు .