Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
నవతెలంగాణ-మోత్కూరు
రైతు వేదికలు నిత్య అధ్యయన కేంద్రాలుగా మారాలని, రైతులకు వ్యవసాయ సంబంధ సేవలన్నీవేదికల నుంచే అందుతాయని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మండలంలోని అనాజిపురం, పాటిమట్ల గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికల క్లస్టర్ భవనాలను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. 5 వేల ఎకరాల పరిధిలో ప్రభుత్వం ఒక్కో క్లస్టర్ భవనం నిర్మించిందని, ఒక్కో వేదిక కోసం ప్రభుత్వం రూ.22 లక్షల నిధులు ఖర్చు చేసిందని తెలిపారు. వ్యవసాయ రంగంలో నూతన విధానాలు, సంస్కరణల కోసం సీఎం కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారన్నారు. రైతుల సంఘటితం చేయడం కోసమే ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రైతు వేదికలు నిర్మించిందని తెలిపారు. భూసార పరీక్షలు, పంట సాగు విశ్లేషణలు, వ్యవసాయాధికారులతో సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు ఇలా రైతు సంబంధ కార్యక్రమాలన్నీ రైతు వేదికల ద్వారానే జరుగుతాయని, రైతులు ఆ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొల్పుల అమరేందర్, ఎంపీపీ దీటి సంధ్యారాణిసందీప్, జెడ్పీటీసీ గోరుపల్లి శారదసంతోష్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, వైస్ ఎంపీపీ బుశిపాక లక్ష్మీ, సర్పంచులు ఉప్పల లక్ష్మమ్మ,దండెబోయిన మల్లేష్, పేలపూడి మధు, ఎంపీటీసీ రచ్చ కల్పనలక్ష్మీనర్సింహారెడ్డి, సింగిల్ విండో చైర్మెన్‌్ కంచర్ల అశోక్ రెడ్డి, వైస్ చైర్మెన్‌్ పేలపూడి వెంకటేశ్వర్లు, డీఏవో అనురాధ, ఏడీఏ వెంకటేశ్వర్రావు, ఏవో కె.స్వప్న, తహసీల్దార్ షేక్ అహ్మద్, ఎంపీడీవో పోరెడ్డి మనోహర్ రెడ్డి, రైతుబంధు మండల కోఆర్డినేటర్ కొండా సోంమల్లు, ఏఈవోలు తుంగ గోపీనాథ్, ముప్పిడి అశోక్, తదితరులు పాల్గొన్నారు.
అడ్డగుడూర్ :మండలం లోని గట్టుసింగారం, చౌల్లరామారం గ్రామాలలో ర్తెతువేదికలు, చౌల్లరామారం గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రం, చిర్రగూడూరు గ్రామంలో వ్తెకుంటధామం , సీసీరోడ్డులను బుధవారం ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ ప్రారంభించారు.గట్టుసింగారం గ్రామంలో నూతన వధూవరులు స్తెదులు అనూష దంపతులను ఆశ్వీరదించారు.చిర్రగూడూరు గ్రామంలో శ్మశానవాటికకు, సీసీిరోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమాలలో యంపిపి దర్శనాల అంజయ్య, జెడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి అయోధ్య,ర్తెతుబంధు సమితి అధ్యక్షులు అమరేందర్ ,మాజీమార్కెట్ చైర్మెన్ చిప్పలపల్లి మహేధ్రనాధ్, పీఏసీఎస్ చైర్మెన్ పొన్నాల వెంకటేశ్వర్లు ,టీిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ మెంబర్ గుండిగ జోసెఫ్, మండల కోఆప్షన్ మెంబర్ మాదాను ఆన్తోని ,మండల ర్తెతుసమన్వయ అధ్యక్షులు తీపిరెడ్డి మేగారెడ్డి ,ఆయా గ్రామాల సర్పంచ్ లు మధ్ధిసత్తయ్య ,నారగోని అంజయ్య గౌడ్,నిమ్మనగోటి జోజి ,కంబంపాటి పరమేష్,వ్తెస్ ఎంపీపీ ద్తెద పురుషోత్తం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.