Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మోత్కూరు
బైక్ పై వెళుతున్న యువకున్ని ఓ లారీ ఢకొీట్టగా మరో లారీ అతని పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని పాటిమట్ల ఎక్స్ రోడ్డు సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... గుండాలమండలం పాచిల్ల గ్రామానికి చెందిన పందుల భిక్షం (25) అత్తగారి ఇంటి వద్ద ఉన్న భార్యాబిడ్డను తీసుకురావడానికి బైక్ పై అడగూడూరు మండలం జానకిపురం గ్రామానికి వెళ్లాడు. బుధవారం మధ్యాహ్నం భార్యాకూతురును తీసుకుని స్వగ్రామానికి వస్తుండగా మోత్కూరు మండలం పాటిమట్ల ఎక్స్ రోడ్డు సమీపంలోకి రాగానే బైక్ లో పెట్రోల్ అయిపోయింది. దీంతో భిక్షం కూతురు (6 నెలలు)ను ఎత్తుకుని లగేజ్‌తో భార్యను పాటిమట్ల ఎక్స్ రోడ్డు వద్ద వదిలి తిరిగి పెట్రోల్ తీసుకుని బైక్ వద్దకు వెళ్లాడు. బైక్ లో పెట్రోల్ పోసుకుని వస్తుండగా ఎదురుగా వచ్చిన ఇసుక లారీ ఢకొీట్టడంతో బైక్ పై నుంచి కింద పడగా వెనకాల ఇసుక లోడ్ లో వస్తున్న మరో లారీ అతని పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మతి చెందాడు. కళ్ల ముందు ఉన్న భర్త క్షణాల్లో రోడ్డు ప్రమాదంలో మతి చెందడంతో భార్య సంధ్య కన్నీరుమున్నీరుగా విలపించింది. మోత్కూరు ఎస్ఐ జి.ఉదరు కిరణ్ సంఘటనా స్థలానికి చేరుకుని లారీ, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించగా, శవాన్ని పోస్టుమార్టం కోసం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ తెలిపారు.