Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హమాలీ సంఘం జిల్లా నాయకులు బూడిద భిక్షం
నవతెలంగాణ- రామన్నపేట
మండలంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు మందకోడిగా సాగడంతో దినసరి కూలీ మీద ఆదారపడ్డ హమాలీ కార్మికులకు కనీస కూలీ పడడం లేదని లేదని, లారీల కొరతను నివారించి, కొనుగోళ్లను వేగవంతం చేయాలని హమాలీ సంఘం జిల్లా ఉపాద్యక్షుడు బూడిద భిక్షం ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం మండలంలోని ఎన్నారం గ్రామంలో హమాలీ కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడుతూఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు నార్లు పోస్తున్నరాన్నారు. హమాలీ కార్మికులు 90శాతం మంది మళ్ళీ వ్యవసాయ కూలీ పనులకు వెళ్లాల్సి ఉందని, అవి కూడా అప్పుడే ప్రారంభమైనవని ఆయన తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరతతో హమాలీ కార్మికులు పడిగాపులు కాయాల్సివస్తుందన్నారు. రైతులకు రెండు విధాలుగా తీవ్రంగా నష్టం ఏర్పడుతుందున, దాన్యం కొనుగోలును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం గ్రామ కార్యదర్శి చిట్టిమల్ల సుదర్శన్, సల్ల గిరి, బొక్క మధుసూదన్, జాల వెంకన్న, బొక్క నర్సిరెడ్డి, అంబాల నర్సింహ్మ, అంబాల మల్లయ్య, జాల మహేష్, అంబటి నర్సింహ్మ, చల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.