Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
కరోనా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ మానవతాదక్పథంతో ముందుకు రావాలని కాంగ్రెస్ జిల్లా నాయకులు ముదిరెడ్డి రమణారెడ్డి కోరారు.టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి స్ఫూర్తితో బుధవారం టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కరోనా బాధిత బంధువులకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 23వ రోజు ఉచిత భోజన సదుపాయాలను ఏర్పాటు చేసి,పంపిణీ చేశారు.ఆస్పత్రికి వచ్చి ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ ఉన్న కారణంగా హోటళ్లు లేక తినడానికి ఇబ్బందులు పడుతున్న పేదవారికి లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు ప్రతిరోజూ 200 మందికి ఉచిత భోజనాల పంపిణీ చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు ధరావరత్ శివనాయక్, గట్టు శ్రీనివాస్, ధరావత్ వెంకన్ననాయక్, పాలవరపు వేణు, సూరినేని జగ్గారావు, నిర్వాహకులు కౌన్సిలర్లు షఫీఉల్లా, వెలుగువెంకన్న, మాజీ కౌన్సిలర్లు అబ్దుల్‌రహీం, ఈర్ల వాసు, వల్దాస్ దేవేందర్, బద్దం విజరురెడ్డి, నాయకులు శ్రీమన్నారాయణ,పాలడుగు పరశురామ్, మునగాల సతీష్, కోడూరు సైదులు, చైతన్య, లింగరాజు పాల్గొన్నారు.