Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణవాదుల ఐక్య వేదిక ప్రతినిధులు పాశం యాదగిరి ,గాదె ఇన్నయ్య
నవతెలంగాణ - భువనగిరి
సూర్యాపేట జిల్లా గుర్రంపోడు భూముల్లో నాలుగు ఎకరాల 30 గుంటల ప్రజల భూములను మాఫియా చేతుల్లోకి వెళ్లిందని మాఫియా ముఠా ఆగడాలు రాష్ట్రంలో పెరిగిపోతున్నాయని తెలంగాణ వాదుల ఐక్యవేదిక ప్రతినిధులు పాశం యాదగిరి, గాదె ఇన్నయ్య విమర్శించారు. శుక్రవారం భువనగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రశ్నించే గొంతుకలను అరెస్టులతో అంచి వేయాలని ప్రభుత్వం చూస్తే పౌరసమాజం చూస్తూ ఊరుకోదని నిశితంగా గమనిస్తుందని అన్నారు. భూమి, ఇసుక, విద్య మాఫియా ముఠా ఆగడాలను బట్టబయలు చేసిన జర్నలిస్టు గంజి రఘు అరెస్ట్ అక్రమమన్నారు. ప్రజల భూములు మాఫియా చేతుల్లోకి వెళ్తుందని రఘు బట్టబయలు చేసినందుకు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రఘు అరెస్టు చేసిన తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వం పోలీసులు మౌనంగా ఉంటే పౌరసమాజం చూస్తూ ఊరుకోదన్నారు. రఘు అరెస్టుపై జిల్లాకు చెందిన మంత్రి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదన్నారు. జర్నలిస్టుల పోరాట ఫలితంగానే తెలంగాణ సాధించుకున్నమన్న విషయాన్ని గుర్తించాలన్నారు. రఘు కుటుంబానికి అండగా ఉంటామన్నారు. రఘు పై పెట్టిన కేసున వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు పల్లె రవికుమార్ మాట్లాడుతూ నిందితులను అరెస్టు చేసే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు విస్మరించారన్నారు. ఈ సమావేశంలో బి. శ్రీనివాస్, వంగరి అజరు కుమార్, బెల్లి కష్ణ యాదవ్ పాల్గొన్నారు.