Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ -ఆలేరుటౌన్
మండలకేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి ఎదుట బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సేవలను శుక్రవారం టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, జెడ్పీఫ్లోర్‌లీడర్ డాక్టర్ కె.నగేశ్, జిల్లా నాయకులు రాంచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రికి సుషీ ట్రస్టు ఆధ్వర్యంలో రూ.30 వేల విలువైన ఆక్సీమీటర్లు , 10 వేల విలువైన బీపీ చెక్ మీటర్లు అందజేసినట్టు తెలిపారు. ,ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ల కోరిక మేరకు ఈసీజీ మిషన్ సైతం ఆస్పత్రికి త్వరలోనే అందజేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కె.వెంకటేశ్వర రాజు, పట్టణ అధ్యక్షుడు ఎంఎ.ఏజాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, సింగిల్ విండో డైరెక్టర్ కట్టెకొమ్ముల సాగర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వల్లెపు ఉప్పలయ్య, మాజీ ఎంపీటీసీ జైనుద్దిన్ ,కొల్లూరు ఎంపీటీసీలు గాజుల లావణ్య వెంకటేష్ సారాజిపేట ఎంపీటీసీ బత్తుల నరేందర్ రెడ్డి, ఆలేరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ .సాగర్ ,నాయకులు చింతలపాని శ్రీనివాస్‌రెడ్డి, కర్రె అజరు, ప్రరే రమేష్ ,అంజయ్య , ఆంజనేయులు, మురళి , జూకంటి సంపత్ , కల కుంట్ల లోకేష్, బండారు జాంగిర్ , శివ కుమార్, సుంకరి విక్రమ్ , కిరణ్ ,నోముల ప్రశాంత్ , బందారపు శివకుమార్ , నవీన్ ,ఉదరు తదితరులు పాల్గొన్నారు.