Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జగదీశ్‌రెడ్డిపై ఆరోపణల్లో నిజం లేదట?
- అంతా చేసింది ఆ రాజకీయ కురవద్ధుడేనట?
నవతెలంగాణ-సూర్యాపేట
టీఆర్ఎస్ ఈటల రాజేందర్‌ని ఎలా ఎదుర్కోవాలని మల్లగుల్లాలు పడుతుంటే అకస్మాత్తుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.అది ఎలా వచ్చింది..? ఎవరు తెచ్చారు..? అనే ఈ ప్రశ్నల వెనక ఆసక్తికరమైన కథనం వినిపిస్తుంది.మంత్రి జగదీశ్‌రెడ్డిపై ధ్వేషం, అసూయ పెంచుకున్న టీఆర్ఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులొకరు ఈ మొత్తం కథ వెనక సూత్రధారిగా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఉమ్మడి నల్లగొండ మంత్రి జగదీశ్‌రెడ్డిని మంత్రిపదవి నుంచి తప్పించడం ఖాయమని నాలుగైదు రోజులుగా జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈటల రాజేందర్‌ని మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయడం, ఆ తర్వాత ఆయన వెళ్లి బీజేపీలో చేరపోతుండడం తెలిసిందే.అయితే ఆ తర్వాత మంత్రి పదవి నుంచి ఊడిపోయేదేవరని మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.కేసీఆర్‌కు అత్యంత నమ్మినబంటుగా ముద్రపడిన మంత్రికి త్వరలో క్యాబినెట్ నుండి ఉద్వాసన తప్పదంటు సోషల్‌మీడియాలో వైరల్అవుతుంది.కొద్ది నెలల కింద కర్నాటకలోని హంపీలో మంత్రి జగదీశ్‌రెడ్డి కుమారుడి పుట్టినరోజు వేడుకల సందర్భంగా జరిగిన సంఘటనలు టీిఆర్‌ఎస్ రాజకీయాలను కుదిపేస్తున్నాయి.ఈ కథ ఏంటో ..సారాంశం ఏంటో ..ఇప్పుడు చూద్దాం అంటూ పలు కథనాలు వెలువడడంతో ఒక్కసారిగా ఉమ్మడి నల్లగొండజిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.జనవరిలో జరిగిన ఒక సంఘటనను ప్రస్తావిస్తూ ఈ కథ రోజురోజుకు పలు మలుపులు తిరిగింది.కర్నాటకలోని జగదీశ్‌రెడ్డి కొందరు ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ చేసుకున్నారని, ఆ సమావేశంలో టీఆర్ఎస్ను, ముఖ్యమంత్రి కేసీఆర్‌ని తీవ్రంగా విమర్శించాడని పలు మీడియా సంస్థలతో పాటు సోషల్‌మీడియాలో కూడా వెలువడిన విషయం తెలిసిందే. మంత్రి నిర్వహించిన ఈ సమావేశంపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న టీఆర్ఎస్ అధిష్టానం ఆయన్ను మంత్రి పదవి నుండి ఉద్వాసన పలికేందుకు సిద్ధమైందని కూడా వార్తలు వెలువడ్డాయి.అయితే డామిట్ కథ అడ్డం తిరిగింది అన్న చందంగా ఈ మొత్తం ఈ వ్యవహారంలో చురుకైన పాత్ర పోషించింది ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఓ సీనియర్ నాయకుడని తెగ ప్రచారం సాగుతోంది.ఈటల ఎపిసోడ్స్ ఒక్కసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లోనూ రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి.ఇంత పెద్దస్థాయిలో జిల్లాలో టీఆర్ఎస్లో అంతర్గత వర్గ పోరాటాలు జరుగుతున్నాయని వెల్లడి అయినందున ఇప్పుడు ఈ సమస్యపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దష్టి సారించినట్టు తెలుస్తోంది.ఇదే నిజమైతే సీఎం ఉమ్మడి జిల్లాకు మరో మంత్రి పదవి ఇస్తాడనే ఆలోచనలు సన్నగిల్లినట్టేనని జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది.
మంత్రి జగదీశ్‌రెడ్డి పదవి పదిలమేనట...
మంత్రి జగదీశ్‌రెడ్డి పదవికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని రాజకీయ విశ్లేషకులు తేటతెల్లంచేస్తున్నారు.రాష్ట్రంలో ఇప్పుడు ఆయన్ను మంత్రి పదవి నుండి తప్పిస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికి అది జరిగే పనికాదని వారంటున్నారు.మంత్రి ఎటువంటిఅవినీతి ఆరోపణల్లో ఇరుక్కోలేదని, సీఎం కేసీఆర్‌పై నోరు పారేసుకునేంత సాహసం చేయబోరని కూడా కొందరు అధికార,ప్రతిపక్ష నాయకులు సమాచారం ద్వారా తెలుస్తోంది.నిన్నగాక మొన్న జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మంత్రి కీలకంగా పనిచేసి మరోసారి పాగా వేసిన సంగతి తెలియనిది కాదు. అందుకు కానుకగా మంత్రి అనుచరునికి కూడా ఎమ్మెల్సీ ఇస్తామని కెేసీఆర్ హామీ కూడా ఇచ్చారు.ఇదిలా ఉండగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి,పల్లా రాజేశ్వర్‌రెడ్డి లు మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నప్పటికీ వీరిలో ఒకరికి మంత్రి పదవి ఇస్తే ఇద్దరు మంత్రులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అవుతారనే అపవాదుని సీఎం మోయక తప్పదంటున్నారు కొందరు సీనియర్ నాయకులు.గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్ మంత్రి జగదీశ్‌రెడ్డి వల్ల బలహీనపడిందన్న ముద్రం సీఎం వద్ద ఉంది.అందుకు ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన నాయకునిగా ఉన్న మంత్రిని కదిలించాలంటే అంత తేలిక కాకపోవచ్చు.ఏదిఏమైనా నామినేట్ ఎమ్మెల్సీ పదవులు ఎవరికి ఇస్తారనే దానిపైనే వేచిచూడాల్సిందే.